Sunday, April 24, 2022

Suryanarayana Dandakam - సూర్యనారాయణ దండకం






శ్రీ సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

ఆత్మరక్షా నమః పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ||

సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి ఏకాకినై చిక్కి
ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ||

సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్
మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారాగ్ర
దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ||

సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ||

సూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ||

Tuesday, January 8, 2019

యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు

యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్త యగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞముఁ గావించితిం ద దర్పణ బుద్ధిన్. 

విశ్వాత్ముండు విశ్వేశుడు విశ్వమయుం డఖిలనేత విష్ణుండజుడీ
విశ్వములోదా నుండును విశ్వము దనలోనజాల వెలుగుచు నుండన్


పోతన కవీంద్రుడు, ఆంధ్ర మహాభాగవతము

శ్రీపతియు యజ్ణపతియు

శ్రీపతియు యజ్ణపతియు బ్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవశ్రే ణీపతియుం గతియునైన నిపుణు భజియింతున్


పోతన కవీంద్రుడు, ఆంధ్ర మహాభాగవతము 

హరిమయము విశ్వమంతయు

హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే

పోతన కవీంద్రుడు, ఆంధ్ర మహాభాగవతము

గిరులం బోలెడి

క. గిరులం బోలెడి కరులను హరులం దన ప్రాణదయితలై | మనియెడి సుం
దరులను హిత నరులను బుధ, వరులను వర్జించి గాఢ | వైరాగ్యమునన్. 

క. గోవిందనామ కీర్తనఁ గావించి భయంబు దక్కి | ఖట్వాంగ ధరి
త్రీ విభుఁడు సూఱగొనియెను, గైవల్యము దొల్లి రెండు | గడియల లోనన్.

పోతన కవీంద్రుడు, ఆంధ్ర మహాభాగవతము

హరికిన్ బట్టపుదేవి

“ హరికిన్ బట్టపుదేవి,పున్నెముల ప్రోవర్ధంపు పెన్నిక్క, చం
దురు తోబుట్టువు భారతీగిరి సుతల్ తో నాడు పూబోణి తా
మర లందుండెడి ముద్దరాలు,ఝగముల్ మన్నించు నిల్లాలు,భా
సురతన్ లేములవాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణమున్.”

పోతన కవంద్రుడు, అంధ్రమహాభాగవతము

అమ్మల గన్నయమ్మ

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

పోతన కవీంద్రుడు, ఆంధ్రమహాభాగవతము