Sunday, September 9, 2018

పద్య సాహిత్యంలో గణపతి స్తుతులు - ఆంధ్రభూమి (దినపత్రిక) వ్యాసం

ప్రణవ స్వరూపుడు - ప్రమద గణాధిపతి - పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన విఘ్న నాయకుడు వేదాల్లో - ఉపనిషత్తుల్లో.. అష్టాదశ పురాణాల్లో కీర్తింపబడినాడు. అలాగే తెలుగు సాహితీ నందనవనంలో, ప్రబంధాలలో - శతక సాహిత్యంలో భాగవత భారత రామాయణాలలో తొలి వేలుపుగా ప్రస్తుతింపబడినవాడు. భావ భాషాత్మకమైన శబ్ద వాచ్యుడై పద్య రచనలలో ప్రాచీనులచే గాక - ఆధునిక కవులచే నుతింపబడి వారి కవిత్వానికి విఘ్నాలు - ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సాహిత్యంలో పద్యాలలో స్తుతింపబడి, నిండి నిబిడీకృతమైనాడు గజముఖుడై పద్య సుమాలచే ఆరాధింపబడినాడు.
గాయత్రీ మంత్రంలో - అంతర్భాగమైన ఒక పద్యం ఇలా ఉంది.
ఉ.తొండము నేక దంతమును - తోరపు బొజ్జయు, వామ హస్తమున్
మెండుగ - మ్రోయు గజ్జెలును - మెల్లని చూపుల - మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున - కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి ‘పార్వతీ తనయ’ ఓయి ‘గణాధిప’ నీకు మ్రొక్కెదన్
అని వర్ణించాడో కవి.
భాగవత పురాణంలో - సహజ కవి బమ్మెర పోతనామాత్యుని అద్భుత వర్ణన గావించిన అంత్యప్రాసతో గూడిన ఒక పద్యం
ఉ.ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - ప్రసన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్

నన్నెచోడుని గ్రంథం కుమార సంభవంలో గణపతి ప్రార్థన

చం.తనునసితాంబు దంబుసిత - దంతయుగంబచిరాంశులాత్మ గ
ర్జన - మురుగర్జనంబుగ - రసద్రుచి - శక్రశరాసనంబునై
చన - మదవారివృష్టి - హితసస్యసమృద్ధిగ - నభ్రవేళ నా
జన ‘గణనాథు’ గొల్తు - ననిశంబు - నభీష్ఠ ఫలప్రదాతకున్
అంటూ మనోజ్ఞంగా వర్ణించాడు మహాకవి.

అభీష్ట సిద్ధి కొరకు అనంతామాత్య కవి తన ప్రబంధం భోజరాజీయంలోని వర్ణన ఇలా సాగింది.
ఉ.విఘ్నము లెల్ల బాపి - పృథివిన్ - భవనీరధి పేరి మిగుల్చి, సం
దఘ్నము చేసి నిల్తు - రుచిరస్థితి నెవ్వని భృత్యులట్టి- దుః
ఖఘు్నడు - షణ్ముఖ ప్రథమ గర్భుడు - భద్రగజాస్యుడైన - యా
విఘ్నవిభుండు - మత్ కృతికి - వేడుకతోడ - సహాయుడయ్యెడున్
ఉ.అంకము చేరి - శైలతనయాస్తన - దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ఠ తొండమున - నవ్వలిచన్ గబళింపబోయి యా
వంక కుచంబు గానక హివల్లభుహారము గాంచి వే మృణా
ళాంకుర శంకనంటిడు - గజాస్యుని గొల్తు - నభీష్ట సిద్ధికిన్
అని నుతించారు ఆ హేరంబునీ, గణపతినీ.
జక్కన కవి తన విక్రమార్క చరితంలోని గణనాయకుని వర్ణన.
చం.కనకనగంబు బొమ్మరముగా - భుజగేంద్రుడు జాలెగా నమ
ర్చిన గిరిపుత్రికాంచి - యివి రెండును - దేవధనంబులన్న -న
జ్జనని హితోపదేశమున సన్మతివాని బునః ప్రతిష్ఠ చే
సిన గణనాయకుండు కృపసేయుత సిద్ధన మంత్రి కోరికల్
అని నుతించాడు. వేడినాడు.
అలాగే శ్రీనాథ కవి ప్రణీతమైన హరవిలాస కావ్యంలోని వర్ణన ఒక సీస పద్యం
సీ.కలిత శుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజల ధరములు
వప్రక్రియా కేళి వశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్న మేఖలములు
పక్వజంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్ కదంబకములు
వికట కండూలగండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు
తే.గీ.శాంభవీ శంభులోచనోత్సవ కరములు
వాసవాద్య మృతాశన వందితములు
‘విఘ్నరాజ’ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి - గావించుగాత
అని రచించారు.
మనోజ్ఞ కవి రామరాజ భూషణుడు తన కావ్యం వసుచరిత్రలో గజముఖుని ప్రస్తుతించిన తీరు ప్రశంసనీయము.
శా.దంతాఘట్టిత రాజతాచల - చలద్గౌరీ స్వయంగ్రాహమున్
కంతుద్వేషికి గూర్చి - శైలజకు - దద్గంగాఝ రాచాంతి న
త్యంతామోదము మున్నుగానిడి - కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతం బుల్వెలయింపంజాలు నిభ రాడ్వక్త్రుం బ్రశంసించెదన్
ప్రాచీన నవీన కవులేగాక నేటి మేటి కవిపుంగవులెందరో గణపతిని స్తోత్రం చేసిన తీరు అద్భుతం. అమోఘం. మచ్చుకు కొన్ని. ఆధునిక కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ గారు వినాయకుని స్తుతించమని విద్యార్థులను మేల్కొలిపిన తీరు ఇలా ఉంది సీస పద్యంలో.
సీ.ఎలుక గుఱ్ఱము మీద - నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు,
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు
నల్లమామాయంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుర్ర
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ - భవాని
నూరేండ్లు నోచిన - నోముపంట
తే.అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చె
ఆంధ్ర విద్యార్థి లెమ్ము - జోహారులిడగ 

- అని వర్ణించారు అభినవ పోతన బిరుదాంకితులు కరుణశ్రీ. వీరే మరొక పద్యంలో గణపతిని బోళా గణపతిగా వినాయకుని ఆహార నైవేద్యాదుల సరళిని తెల్పినారు. గుంజిళ్లు తనకు ఎంతో ఇష్టమని గణపతి పొంగిపోయే రీతి అద్భుతం.

సీ.లడ్డూ జిలేబీ హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్లకే చెయ్యి చాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలు పడును
ముడుపుమూటల పెట్టుబడి పట్టుదల లేదు
పొట్టి గుంజిళ్లకే పొంగిపోవు
కల్కితురారుూలకై తగాదా లేదు
గరిక పూజకె తలకాయనొగ్గు

గీ.పంచకల్యాణికై - యల్కపాన్పు లేదు
ఎలుకతత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టులేదు
పచ్చి వడపప్పె తిను - వట్టి పిచ్చి తండ్రి’ 

అని జాలిగా వర్ణించారు.
గణపతికి భోగభాగ్యాలక్కరలేదనీ తెలిపారు. ఈ విధంగా భారతీయ ఆంధ్ర సాహితీ సీమలో పద్య రచనలో విఘ్న నాయకుడైన విఘ్నాధిపతిని సకల జగతీ ఆరాధించి అర్చించి తరించాలనీ మనసారా ఆకాంక్ష.
ఓం శ్రీ గణాధిపతయే నమః
-పి.వి.సీతారామమూర్తి 9490386015

ఆంధ్రభూమి పత్రిక లో ఈనాడు వచ్చిన వ్యాసం యధాతథంగా 

లింకు 

http://www.andhrabhoomi.net/weekly_special/aadivaram/content/190273

పై వ్యాసానికి మఱొక కొనసాగింపు పద్యము.

పెద్దనగారి "స్వారోచిషమనుసంభవము"లోనిది. 

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా:
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ:
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా:
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌:

Monday, September 3, 2018

వేంకటనాయకుడు - స్తుతి

క. అలమేలు మంగ మాంబను
చెలిఁగాఁగైకొనియు నెలమి శ్రీతిర్మలపై
నెలవై భక్తులఁ బ్రోఁచెడి
యిలువేల్పుం గొలుతు వేంకటేశ్వరదేవున్

(స్తుత్యంజలి - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి)

శివుని స్తుతి

ఉ. దేవ! మహానుభావ! భవ
                                  దీయచరిత్రము లద్భుతంబులై
పావన మౌచు యీ భువన
                                  వంద్యము లై చెలువారుచుండునో
దేవర! మీకృపారసము
                                  దీనులపై నిక్ జూపవేమి మా
భావములందు నెంచి బహు
                                  భంగుల్ బ్రస్తుతిజేతు మీశ్వరా!!



మ. హర! గంగాధర! ఫాలనేత్ర! రివు సం
                                 హారా! దయాంభోనిధీ!
వరగౌరీ కుచకుంకుమాగరుల స
                                 త్పాటీబాహ్వంతరా!
కరముల్ మోడ్చి నమస్కరించిని యో
                                కైవల్య సంధాయకా!
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
                                శా! బ్రోవు సర్వేశ్వరా!



మ. నిరతంబున్ నిను గొల్పి భక్తవరులున్
                                                నిత్యంబు నీ సన్నిధిన్
పరమామోదముతోడ నుందు రని చె
                                                 ప్ప న్వింటి ముమ్మాటికిన్
మొర నాలించియు నాశ లన్నియును ని
                                                 ర్మూలంబుగా జేయు మీ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
                                                 శా! బ్రోవు వీరేశ్వరా!



మ. స్థిరమౌ నీ దగు నామమంత్రమును మా
                                          చిత్తంబులన్ నమ్మి తో
పరమేశా! గిరిజాధవా! మురహరా!
                                          ఫాలక్షా! యం చాత్మలో
పరితాపంబును జెందు భక్తతతి కా
                                          పాడంగ విచ్చేసితౌ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
                                          శా! బ్రోవు భీమేశ్వరా!



సీ. మహనీయ! నీ దగు మహిమల దెలియంగ
                                           నల మౌనివరులకు నలవి యగునె
యీశ్వర! నీరూప మేవేళలందైన
                                           వేదాంతదృష్టుల వెలయుచుండు
యిందుశేఖరు డెందమందు ధ్యానించంగ
                                           యీషణత్రిత్రయం బదెల్ల బాయు
భవ! నీ శిరమ్మునం బరగు యా సురనది
                                           రంగత్తరంగముల్ పొంగుచుండు.



గీ. భువనవందిత జగదంబ యెవని పత్ని
వాసుకియు తక్షకుండును వరసుకుండ
లమ్ములై యుండు యెవని కర్ణమ్ములందు
ఆమహేశుడ వీవు గావే మహాత్మ!



గీ. రాజసంబున సృజియించు ప్రభు వెవండొ
సాత్వికంబున బోషించు స్వామి యెవడొ
తామసంబున హరియించు దైవ మెవడొ
అట్టి దేవాదిదేవుడ వయ్య నీవు!


సీ. శ్రీపార్వతీనాథ! శ్రితజనమందార!
                                                      దీనశరణ్య! యో దేవ దేవ!
పన్నగభూషణ! సన్నుతామరవంద్య!
                                                      దీనశరణ్య! యో దేవ దేవ!
శ్రీసదాశంభో! సు వాసుకి భూషణ!
                                                      మునివంద్య! నీకు నమోస్తు దేవ!
పరమేశ్వరా! భక్తవరకల్పకద్రుమా!
                                                      అరమరగాదు మా శరణు దేవ!


గీ. సర్వలోకాధినాథ! యో శరణు దేవ!
సకలభూతేశ! శంకర! శరణు దేవ!
సకలమౌనీశ! విశ్వేశ! శరణుదేవ!
దీనులను మమ్ము బ్రోవు మో దేవ దేవ!


గీ. అనుపమానుండు నజరుండు నద్వితీయు
డాదిదేవు డనంతుండు నవ్యయుండు
సర్వ జీవుల సమబుద్ధి సాకుచుండు
నట్టి సర్వేశ ని న్నాత్మయందు దలతు.


కం. సిరి పోగుజేయుటయు మరి
వరపుత్రునియందు ప్రేమ వరలెడుభంగిన్
నిరతము నొక క్షణమైనను
పరశివ నినుగొల్వ ముక్తి బడయుదురుగదా!


సీ. సర్వలోకాధిప! సనకాదిమునివంద్య!
                                         శర్వ! యుమేశ్వర! శరణు శరణు
సచ్చిదానందుండ! స్వఃప్రకాశ! మహేశ!
                                         జగదేకవంద్యండ! శరణు శరణు
నిర్వికల్పుండవో నిగమాంతసంచార!
                                         సర్వలోకాధ్యక్ష! శరణు శరణు
నిర్గుణబ్రహ్మవు నిర్మలజ్ఞ‌ానివి
                                         సాధుమనోల్లాస! శరణు శరణు


గీ. మూడుమూర్తుల కాధారమూర్తి! శరణు
జగము లెల్లను నేలెడి స్వామి శరణు
యెల్లజీవుల రక్షించు యీశ! శరణు
దీనజనవంద్య! మమ్మేలు దేవ దేవ!

(తృతీయావతంసము - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి) 

వాగ్దేవి స్తుతి

సీ. ఏ మహాదేవి దా నేవేళ్ నాధుని
                                    తలవాకి లిల్లుగా మెలగుచుండు
ఏ మహాదేవి దా నింపుమీరగ వీణ
                                    సామగానమును త్రిస్థాయి మీటు
ఏ మహాదేవి దా నెల్లకవీంద్రుల
                                     వాగ్వీధి సులలిత పదములుంచు
ఏ మహాదేవి దా నెల్లవిద్యలఁ బుత్ర
                                     వాత్సల్యమున నేర్పు పంతులమ్మ


తే.గీ వనజసంభవురాణి గీ ర్వాణి నీల
వేణి పుస్తకపాణియౌ వాణి నాదు
వాక్కుననునిల్చి కృతిరస వంతముగను
తీర్చి దిద్దుతఁ దేనియ తేట పగిది.

(స్తుత్యంజలి - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి)

Sunday, September 2, 2018

గణాధిపతి స్తుతి

క. అరమేనఁ బ్రియసతీదే
హరమన్ శృంగార రౌద్ర మమరిన నటుఁడీ
సిరియాళవరదుఁ డింజర
మిరవగు శ్రీపార్వతీకృపేశ్వరుఁడోమున్


ఉ. శీతనాత్మజానుతునిఁ 
                           జిత్తసరోజమునందుఁ జేర్చి నే
ప్రీతిని సంస్మరించెద న
                           భీష్ట త్రివర్గఫలాభి కాంక్షతోఁ
జేతులుమోడ్చి వందనము
                           సేసెద విఘ్నములెల్ల ద్రోయ వి
ఖ్యాత యశస్కుఁడౌ యల గ
                            ణాథిపతిన్ శరణాగతావనున్

(స్తుత్యంజలి, సిరియాళ చరిత్రము, సాలగ్రామ చింతామణి కవి)

మరో మాట

నమస్కారం.,

మనదైన సంస్కృతి బ్లాగు మొదలుపెట్టి, 5-6యేళ్లపైనే అయినా, ఋగ్వేద సంధ్యావందనం తప్పితే, మఱొక పోస్టు వేయలేదు. విషయపరిజ్ణానం అంతగా లేకపోవడం ముఖ్యకారణం అయితే, టైం దొరక్కపోవడం ఇంకొక చిన్న కారణం.

ఇకపైన, ఈ బ్లాగులో తెలుగు కవులు రాసిన గ్రంథాల నుండి వివిధ దేవీదేవతల గుఱించి పద్యాలను సేకరించి ఉంచాలని ఉద్దేశ్యంతో మళ్ళీ ఈ బ్లాగుని మళ్ళీ వినియోగిస్తున్నాను. ఇందుకు గల కారణాలు.

1) నాకు తెలిసున్నంతవరకు, మన తెలుగు మతభాష కాదు. అంటే మనగుళ్ళలో చదివే మంత్రాలలో,  సంస్కృతమే తప్ప, తెలుగు ఎక్కడో కానీ కనబడదు. తెలుగువాళ్ళు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించాలంటే, సంస్కృతమే కావాలి. మతభాష గురించి, ఇంకొంచెం తెలుసుకోవాలంటే, మన పొరుగునున్న భాషలగురించి, నాకున్న తెలిసున్న నాలుగైదు మాటలు రాస్తాను.

తమిళం: వైష్ణవ సంప్రదాయంలో తమిళానికి, సంస్కృతంతో సమానమైన స్థానమున్నది. తిరుమల వేంకటేశ్వరుని గుడి గోడలను చూస్తేనే ఈ సంగతి మనకు అర్థమై ఉంటుంది. గుడిగోడల మీద శిల్పుల కోడింగ్ తెలుగు (లిపి)లో ఉంటే, శాసనాలూ, స్తుతులు సంస్కృత, తమిళ భాషలలోనే ఎక్కువగా ఉంటుంది. కట్టిన శిల్పులు మన తెలుగువారు, కానీ మన తెలుగు గుడి చరిత్రకి ఎక్కడానికి, విజయనగర కాలం వఱకూ సమయం పట్టింది. గుడిపైనున్న శాసనాల్లో, అన్నిటి కన్నా ప్రాచీనమైనది క్రీ.శ 9 వ శతాబ్దానికి చెందిన పల్లవరాణి "సామవై" వేయించిన తమిళ శాసనం.

తమిళనాడే కాక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న అన్ని విష్ణ్వాలయాల్లోనూ ధనుర్మాసం సందర్భంగా, చదివే తిరుప్పావై పాశురాలు, తమిళ భాషలోవేనన్న విషయం మనకందరికీ తెలుసు. అవికాక, పాతకాలంనాటి గుళ్లన్నిటిలోనూ, "ద్రవిడవేదం" చదువుతారు.

కన్నడం:  లింగాయతులకు, కన్నడభాషలోని "వచన సాహిత్యం" విశిష్టమైనది. తెలుగులోని "బసవ పురాణం" (పాల్కురికి సోమనాధుడు) కూడా ముఖ్యగ్రంథమైనప్పటికీ, దాని కన్నడ అనువాదమే కన్నడిగులకి ఎక్కువగా పరిచయం. నేటి కర్నాటకకి వెలుపల ఉన్న కేదార్ నాధ్, ఉజ్జయిని, శ్రీశైలం లలో ఉన్న వీరశైవ పీఠాలలో కన్నడ ముఖ్యభాష. కేదార్ నాథ్ గుడిలో సైతం, కన్నడ భాషలో పూజ జరిగే సంప్రదాయం ఉందన్నది, చాలా కొద్ది మందికే తెలుసు.

హిందీవారికి "చాలీసా"లు, సాయిబాబా గుళ్ళలో మరాఠీ భాషలు సేవలు.

తెలుగువారికి ఒక్క దండక సాహిత్యంలో మాత్రమే ఇష్టదైవాన్ని కొలవడం మనం చూస్తాం. ఇవికాక, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు, వంటివి గానం చేయడం ఉంది. అయితే, తెలుగు గ్రంథాల పఠనం, ఒక సంప్రదాయంగా లేదు.

2) మన భాషలో ప్రతిరోజు చేసుకునేందుకు సైతం, మనం సంస్కృతాన్నే వినియోగిస్తాము. అందుకే మనకున్న సాహిత్యంలోనుండి, కొన్నిటిని సేకరించి, అంతర్జాలంలో అందుబాటులో ఉంచేందుకు ఈ చిన్న ప్రయత్నం.

3) నిజానికి ఒక సంప్రదాయాన్ని ప్రారంభించాలన్నా, మార్పుచేర్పులు చేయాలన్నా, సర్వసంగపరిత్యాగులు, సన్యాసులు, పీఠాధిపతులు పూనుకోవాల్సి ఉంటుంది. తప్పితే, నాబోటి సాధారణ గృహస్థునికి, ఎంతో కషమైనదని తెలుసు.

4) అయితే, ఈ ప్రయత్నం చేయడం వలన, కొద్దిమందికైనా ఈ అలోచన పంచుకున్నవాణ్ణవుతానని ఆశితున్నాను. కనీసం ఒక్కరికి ఈ ఆలోచన కరెక్టనిపించినా, ఈ ప్రయత్నం విజయవంతమైనట్టుగా భావిస్తాను.

5) ఇందులో, రోజుకో పద్యం చొప్పున, యేడాది పాటు సేకరించాలని, ఇప్పటికి లక్ష్యంగా పెట్టుకుంటున్నాను.

6) ఇందులో ఉంచే పద్యాలుగానీ, ఇతర సాహిత్యం గానీ, నా సొంతది కాదు. నా సొంత పద్యాలు రాసే స్థాయి నాకిప్పటికీ లేదు. భవిష్యత్తులోనైనా వస్తుందని ఆశిస్తున్నాను.

ఈ ప్రయత్నాన్ని, మనకు లభిస్తున్న తెలుగు సాహిత్యంలో మొదటిదయిన "ఆంధ్ర మహాభారతం" లోని సంస్కృత శ్లోకంతోనే ప్రారంభిస్తున్నాను.

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే
లోకానాం స్థితిమావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై
ర్భూయాసు: పురుషోత్త మామ్హుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే

అటుపైన మా మునిముత్తాతగారు సాలగ్రామ చింతామణి కవి గారు రచించిన "సిరియాళ చరిత్రము"లోని పద్యాలతో పోస్టులను వేయదలుచుకున్నాను. 

నెనరులు

Sunday, January 1, 2012

ఋగ్వేద సంధ్యావందనం (Rigveda Sandhyavandanam in Telugu)


గురువులకి నమస్కరిస్తూ......!


ఋగ్వేద సంధ్యావందనం
1. శ్రీ గురుభ్యో నమః
2. శ్రీ మహాగణాధిపతియే నమః
3. శ్రీ మహా సరస్వత్త్యై నమః
4. హరిః ఓం

మార్జనం
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా య: స్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచి:, పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమ: (3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకొనవలెను)

ఆచమనం

ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి  ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, (నీటిని వదిలి నమస్కరిస్తూ) ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:, ఓం మధుసూదనాయ నమ:, ఓం త్రి విక్రమాయ నమ: ఓం వామనాయ నమ:, ఓం శ్రీధరాయ నమ:, ఓం హృషీకేశాయ నమ:, ఓం పద్మనాభాయ నమ:ఓం దామోదరాయ నమ:, ఓం సంకర్షణాయ నమ:, ఓం వాసుదేవాయ నమ:, ఓం ప్రద్యు మ్నాయ నమ:. ఓం అనిరుద్ధాయ నమ:, ఓం పురుషోత్తమాయ నమ:, ఓం అధోక్షజాయ నమ:, ఓం నారసింహాయ నమ:, ఓం అచ్యుతాయ నమ:, ఓం జనార్ధనాయ నమ: ఓం ఉపేంద్రాయ నమ:, ఓం హరయే నమ:, ఓం శ్రీ కృష్ణాయ నమ:, శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:

ప్రాణాయామం
పృథివ్యాః మేరుపృష్ట ఋషిః కూర్మోదేవతా సుతలం ఛంధః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛంధః ప్రాణాయామే వినియోగః (ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి)
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్
సంకల్పం
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన........సంవత్సరే....అయనే....ఋతౌ.....మాసే, శుక్ల/కృష్ణ పక్షే ....తిథౌ....వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్....గోత్రః .....నామధేయోహం (వివాహమైనవారు "ధర్మపత్నీ సమేతోహం" అని చెప్పుకోవాలి)
మార్జనం
ఓం ఆపోహిష్టేతి త్రయాణాం మంత్రాణాం సింధుద్వీప ఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః
పాదాంత మార్జనే వినియోగః
(నీళ్లు నెత్తిమీద జల్లుకుంటూ క్రింది మంత్రాన్ని జపించాలి)
ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే
యోవశ్శివతమో రసః తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః
తస్మా అదరంగ మామవః యస్యక్షయాయ జిన్వధా ఆపోజన యథాచనః
(నీటిని తీసుకొని క్రింది విధంగా అభిమంత్రించాలి)
ఓం సూర్యశ్చ ఇత్యస్య (అగ్నిశ్చ ఇత్యస్య) మంత్రస్య నారాయణ ఋషిః (యాజ్ఞవల్క్యోపనిషద్ ఋషిః) సూర్య (అగ్ని) మామన్యుపతయో రాత్రయో దేవతా (అహర్దేవతా) ప్రకృతిః ఛంధః అంతశ్శుధ్యర్ధం జలాభి మంత్రణే వినియోగః
ఓం సూర్యశ్చ (అగ్నిశ్చ) మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. యద్రాత్యా(యదాహ్నా) పాపమ కార్షమ్. మనసావాచా హస్తాభ్యాం. పద్భ్యా ముదరేణ శిశ్నాత్ రాత్రి(అహ) స్తదవలంపతు. యత్కించ దురితం మయి. ఇదమహం మామృతయోనౌ. సూర్యే(సత్యే) జ్యోతిషి జుహోమి స్వాహా (అని చెప్పి నీళ్లు త్రాగాలి) (పైన బ్రాకెట్లలో ఉన్నవి పూర్వమందున్న పదాలకు బదులుగా ఉపయోగించి సాయంత్రం చెప్పవలెను)
తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి
ఓం కేశవాయ స్వాహ....శ్రీ కృష్ణాయ నమః

పునర్మార్జనం
ఆపోహిష్టేతి నవర్చస్య సూక్తస్య! సింధుద్వీపోంబరీషోవా! ఋషిః ఆపోగాయత్రీ పంచమీ వర్ధమానా! సప్తమీ ప్రతిష్టా! అంత్యేద్వే అనుష్టుభౌ! పునర్మార్జనే వినియోగః
(మరల తలపై నీళ్లు జల్లుకుంటూ క్రింది మంత్రం జపించాలి)
ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే!
యోవశ్శివతమో రసః తస్యభాజయతే హనః! ఉశతీరివ మాతరః!
ఓం తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథ! ఆపోచన యథాచనః!
ఓం శంనో దేవి రభీష్టయ ఆపో భవంతు పీతయే శం యో రభిస్రవంతు నః!
ఈశానా వార్యాణామ్ క్షయంతీం శ్చర్షణీనాం! ఆపోయాచామి భేషజం!
అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ! అగ్నించ విశ్వ శంభువం!
ఆపః పృణీత భేషజమ్ వరూధం తన్వే మమఁ జ్యోక్చ సూర్యం దృశే!
ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి యద్వాహమభి దుద్రోహ యద్వాశేప ఉతానృతం!
ఆపో అద్యాన్వ చారిషమ్ రసేన సమగస్మహి పయస్వానగ్న ఆగహి!
తం మాసం సృజవర్చసా! ససృషీస్తదపసో దివానక్తంచ ససృషీః! వరేణ్యక్రతూ రహమాదేవీ రవ సేహువే! ఆపో మాం రక్షంతు!
పాపపురుష దహనం
ఓం ఋతంచ సత్యంచ ఇత్యస్య సూక్తస్య. అఘమర్షణ ఋషిః. భావవృత్తో దేవతా!
అనుష్టుప్ ఛంధః! పాపపురుష జల విసర్జనే వినియోగః!
(నీటిని తీసుకొని క్రింది విధంగా అభిమంత్రించాలి)
ఓం ఋతం సత్యమ్ అభీద్ధాత్ తపసోధ్యజాయత! తతోరాత్ర్య జాయత!
తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవా దధి సంవత్సరో అజాయత!
అహోరాత్రాణి విదధ ద్విశ్వస్యమిషతో వశీ! సూర్యా చంద్రమసౌ ధాతాయథా పూర్వమకల్పయత్! దివించ పృథివీంచ అంతరిక్ష మధో స్వః!
(నీటిని వీడిచి పెట్టాలి)
మరల ఆచమనం చేయాలి
ఓం కేశవాయ స్వాహా....ఓం కృష్ణాయ నమః
అర్ఘ్య ప్రదానం
ఓం తత్సవితు రిత్యస్య మంత్రస్య! గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా! గాయత్రీ ఛంధః! ప్రాత రర్ఘ్యప్రదానే (సాయమర్ఘ్య ప్రదానే) వినియోగః!
ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(అని పై మంత్రమును మూడుసార్లు జపించి, నీటిని మూడు సార్లూ విడిచిపెట్టాలి)

1. ప్రాతః కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం
యదద్యకచ్చ ఇత్యస్య మంత్రస్య - సుకక్ష ఋషిః ఇంద్రో దేవతా - గాయత్రీ ఛంధః కాలాతీత ప్రాతః సంధ్యావందన కృతదోష నిహరణార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః. యదద్యకచ్చ వృత్రహన్నుదగా అభిసూర్య. సర్వంతదింద్ర తేవసే
శ్లో.. సోహమర్కోస్మ్యహం జ్యోతి రాత్మాజ్యోతి రహం శివః. ఆత్మజ్యోతిరహం శుక్ల స్సర్వజ్యోతిరసోస్మ్యహం. ఆగచ్ఛవరదే దేవి గాయత్రీ బ్రహ్మరూపిణీ. జపానుష్టాన సిద్ధ్యర్థం ప్రవిశ్య హృదయం మమ. ఉత్తిష్టదేవిగంతవ్యం పునరాగమనాయచ. అర్ఘ్యేషు దేవిగంతవ్యం ప్రవిశ్య హృదయం మమ||
ఉదకమును ప్రదక్షిణముగా శిరస్సు చుట్టూ త్రిప్పుతూ వదిలి పెట్టవలెను. అసావాదిత్యో బ్రహ్మా||
ఓం కేశవాయ స్వాహా..ఓం శ్రీ కృష్ణాయ నమ:||
2. సాయం కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం||
ఉద్ఘేదభీతి అంగీరస శ్శ్రుతకక్షస్సుకక్షోవా! ఋషి: ఇంద్రో గాయత్రీ! సాయంకాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగ:
ఉద్ఘేదభిశ్రుతామఘం వృషభం నర్యాపసం! అస్తారమేషి సూర్య!
సోమర్కోస్మ్యహం............అసావాదిత్యో బ్రహ్మా||
ఓం కేశవాయస్వాహా.....ఓం కృష్ణాయనమ:

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ! అగ్నిర్దేవతా! బ్రహ్మ ఇత్యార్షం! గాయత్రం ఛందం! పరమాత్మం సరూపం! సాయుజ్యం వినియోగం! ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం! గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే! యదాహ్నాత్కురుతే పాపాం తదాహ్నాత్ప్రతి ముచ్యతే! యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ప్రతి ముచ్యతే! సర్వవర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతీ! (అరచేతులు రెండూ జోడించి) ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి! విశ్వమసి విశ్వాయు: సర్వమసి సర్వాయు:! అభిభూరోం (తరువాతి మాటలను చెప్తూ చేతుల్ని తనవైపు త్రిప్పుకోవాలి) గాయత్రీ మావాహయామి! సావిత్రీమావాహయామి! సరస్వతీమావాహయామి! ఛందర్షీనావాహయామి! శ్రియమావాహయామి! బలమావాహయామి!
గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి:! సవితా దేవతా అగ్నిర్ముఖం (కుడి చేతితో ముఖాన్ని), బ్రహ్మశిర: (శిరస్సును), విష్ణు:హృదయం (హృదయాన్ని), రుద్రశిఖా.! (శిఖను ముట్టుకోవాలి) పృథివీ యోని: ప్రాణాపానవ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయనస సగోత్రా గాయత్రీ! చతుర్వింశ్యత్యక్షర త్రిపద షట్కుక్షి: (అని కుడిచేతితో ఎడమచేతిని కొట్టాలి) పంచశీర్షోపనయనే వినియోగ:! ఓం భూ:! ఓం భువ: ఓం స్వ: ఓం మహ:! ఓం జన: ఓం తప: ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్‌, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వరోం! (అని ముందు విధంగా గాలిని పీల్చి బంధించి వదలాలి) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ (సాయం సంధ్యాంగ) యధాశక్తి గాయత్రీమంత్రజపం కరిష్యే! (అని అనామిక వేలుతో నీటిని ముట్టుకోవాలి)
కరన్యాసం
(రెండు చేతులతో చేయాలి)
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ: (చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి)
వరేణ్యం విష్ణాత్మనే తర్జనీభ్యాం నమ:! (బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి)
భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: (బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి)
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి)
ధియోయోన: జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమ: (బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి)
ప్రచోదయాత్‌ సర్వాత్మనే కరతలకర పృష్టాభ్యాం నమ: (అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి)
అంగన్యాసం
ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని)
వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా! (కుడి అరచేతితో శిరస్సును)
భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్‌! (కుడి అరచేతితో శిఖను స్పృశించాలి)
ధీమహి సత్యాత్మనే కవచాయహుం! (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి)
ధియోయోన: జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్‌! (కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి)
ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌! (తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి) భూర్భువస్వరోమితి దిగ్భంధ:! (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడివేయాలి)
ధ్యానం
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై: ముఖై: త్రీక్షణై:!
యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం!
గాయత్రీం వరదాభయాం కుశకశా: శుభ్రం కపాలం గదాం!
శంఖం చక్రమథారవింద యుగళాం హస్తైర్వహంతీంభజే!
యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరా:!
ప్రేరయేత్తస్య యద్భర్గ: తద్వరేణ్యముపాస్మహే!!
ఓం ప్రాత (సాయం) సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే!!
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియోయోన: ప్రచోయాత్‌||
(108 జపించుట ఉత్తమము లేనిచో కనీసం 10సార్లు అయినా జపించవలెను)
తత్సద్బ్రహ్మార్పణమస్తు (అని నీళ్లు వదిలి పెట్టాలి)
(తరువాత లేచి నిలబడాలి, ఉదయం తూర్పువైపుకి, సాయంత్రం పశ్చిమం వైపుకి తిరిగి నమస్కరిస్తూ క్రింది విధంగా చెప్పాలి)
ఓం జాతవేదసే ఇత్యస్య సూక్తస్య! మరీచి పుత్ర: కశ్యప ఋషి:! జాతవేదాగ్నిర్దేవతా! త్రిష్టుప్‌ ఛంద: సూర్యోపస్థానే వినియోగ:! (సాయంత్రం అయితే సంధ్యోపస్థానే వినియోగ:)
ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేద:| సన: పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుమ్‌ దురితాత్యగ్ని:||
తచ్ఛంయోరిత్యస్య మంత్రస్య! శంయు ఋషి:! విశ్వేదేవాదేవతా! శక్వరీ ఛంద:! శాంత్యర్థే జపే వినియోగ:!
ఓం తచ్ఛం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాయా గాతుం యజ్ఞపతయే!
దైవీ స్వస్తిరస్తున:!స్వస్తిర్మానుషేభ్య:! ఊర్ధ్వం జిగాతు భేషజం!
శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే!

ఓం నమ: ప్రాచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించాలి)
ఓం దక్షిణాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమోనమ: (దక్షిణం)
ఓం నమ: ప్రతీచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (పడమర)
ఓం నమ: ఉదీచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (ఉత్తరం)
ఓం నమ: ఊర్ధ్వాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (పైకి)
ఓం నమ: అధరాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (కిందకి)
ఓం నమ: అవాంతరాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (మూలలు)
ఓం నమో గంగా యమునయో: మధ్యయే వస న్తి తేమే ప్రసన్నాత్మాన: చిరంజీవితుం వర్ధయంతి ఓం నమో గంగా యమునయో: మునిభ్యశ్చ నమ:! సంధ్యాయై నమ:! గాయత్ర్యై నమ:! సావిత్ర్యై నమ:! సరస్వత్యై నమ:! సర్వాభ్యో దేవతాభ్యో నమ: దేవేభ్యో నమ:! ఋషిభ్యో నమ:! మునిభ్యో నమ:! గురుభ్యో నమ:! మాతృభ్యో: నమ:! పితృభ్యో: నమ:! కామోకార్షీ న్మ న్యుర కార్షీన్‌ నమో నమ:! పృధివ్యాపస్తేజో వాయురాకాశాత్‌! ఓం నమో భగవతే వాసుదేవాయ యాంసదా సర్వభూతాని చరాణీ స్థావరాణిచ! సాయం ప్రాతర్నమస్యంతి సామాసంధ్యాభిరక్షతు!! శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివ:|| యథాశివమయో విష్ణు:! ఏవం విష్ణుమయశ్శివ:! యథాంతరం నమస్యామి తథామే స్వస్తిరాయుషి! బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన:! బ్రహ్మణ్య: పుండరీకాక్షో బ్రహ్మణ్యో గరుడధ్వజ:!! నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ! జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ:! ఉత్తమే శిఖరేజాతే భూ మ్యాం పర్వతమూర్ధని! బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గచ్ఛదేవి యధాసుఖం!
స్తుతోమయా వరదావేదమాతా ప్రచోదయ న్తీ  పవనేద్విజాతా ! ఆయు: పృధివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం! సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం! తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనం! ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం! సర్వదేవనమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి| శ్రీకేశవం ప్రతిగచ్ఛతి ఇత్యో నమ ఇతి|| క్షీరేణ స్నాపితే దేవీ చందనేన విలేపితే! బిల్వపత్రార్చితే దేవి అహం దుర్గే శరణాగత:! వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం! సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే! నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే! సహస్రనా మ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ:! భద్రం న ఇత్యస్య మంత్రస్య ఇంద్రపుత్రో విమద ఋషి: అగ్నిర్దేవతా ఏకపదా విరాట్చంద: శాంత్యర్ధే జపే వినియోగ: ఓం భద్రంనో అపివాతమ మన:! ఓం శాంతిశ్శాంతి శ్శాంతి:! మమ సర్వారిష్ట శాంతిరస్తు!
ప్రవర
ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య: శుభం భవతు!.........ప్రవరా న్విత............గోత్ర: అశ్వలాయనసూత్ర: ఋక్‌ శాఖాధ్యాయీ..................శర్మా అహం భో అభివాదయే!

ఆచమనం
ఓం కేశవాయ స్వాహా..................శ్రీ కృష్ణాయ నమ:!
ఆ బ్రహ్మలోకాదాశేషాత్‌ ఆలోకాలోకపర్వతాత్‌! యేస న్తి బ్రాహ్మణా దేవా: తేభ్యోనిత్యం నమో నమ:!!(అని నమస్కరించాలి) ప్రాత: (సాయం) సంధ్యావందనం సమాప్తం.
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్‌|
      కరోమి యద్యత్‌ సకలం నారాయణేతి సమర్పయామి||
శ్లో|| గురు: బ్రహ్మా గురు: విష్ణు గురుద్దేవో మహేశ్వర:|
      గురు సాక్షాత్‌ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:||


(తప్పొప్పులను, వీలుచూసుకొని సరిచేయగలవాడను)