ఉ. దేవ! మహానుభావ! భవ
దీయచరిత్రము లద్భుతంబులై
పావన మౌచు యీ భువన
వంద్యము లై చెలువారుచుండునో
దేవర! మీకృపారసము
దీనులపై నిక్ జూపవేమి మా
భావములందు నెంచి బహు
భంగుల్ బ్రస్తుతిజేతు మీశ్వరా!!
మ. హర! గంగాధర! ఫాలనేత్ర! రివు సం
హారా! దయాంభోనిధీ!
వరగౌరీ కుచకుంకుమాగరుల స
త్పాటీబాహ్వంతరా!
కరముల్ మోడ్చి నమస్కరించిని యో
కైవల్య సంధాయకా!
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
శా! బ్రోవు సర్వేశ్వరా!
మ. నిరతంబున్ నిను గొల్పి భక్తవరులున్
నిత్యంబు నీ సన్నిధిన్
పరమామోదముతోడ నుందు రని చె
ప్ప న్వింటి ముమ్మాటికిన్
మొర నాలించియు నాశ లన్నియును ని
ర్మూలంబుగా జేయు మీ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
శా! బ్రోవు వీరేశ్వరా!
మ. స్థిరమౌ నీ దగు నామమంత్రమును మా
చిత్తంబులన్ నమ్మి తో
పరమేశా! గిరిజాధవా! మురహరా!
ఫాలక్షా! యం చాత్మలో
పరితాపంబును జెందు భక్తతతి కా
పాడంగ విచ్చేసితౌ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
శా! బ్రోవు భీమేశ్వరా!
సీ. మహనీయ! నీ దగు మహిమల దెలియంగ
నల మౌనివరులకు నలవి యగునె
యీశ్వర! నీరూప మేవేళలందైన
వేదాంతదృష్టుల వెలయుచుండు
యిందుశేఖరు డెందమందు ధ్యానించంగ
యీషణత్రిత్రయం బదెల్ల బాయు
భవ! నీ శిరమ్మునం బరగు యా సురనది
రంగత్తరంగముల్ పొంగుచుండు.
గీ. భువనవందిత జగదంబ యెవని పత్ని
వాసుకియు తక్షకుండును వరసుకుండ
లమ్ములై యుండు యెవని కర్ణమ్ములందు
ఆమహేశుడ వీవు గావే మహాత్మ!
గీ. రాజసంబున సృజియించు ప్రభు వెవండొ
సాత్వికంబున బోషించు స్వామి యెవడొ
తామసంబున హరియించు దైవ మెవడొ
అట్టి దేవాదిదేవుడ వయ్య నీవు!
సీ. శ్రీపార్వతీనాథ! శ్రితజనమందార!
దీనశరణ్య! యో దేవ దేవ!
పన్నగభూషణ! సన్నుతామరవంద్య!
దీనశరణ్య! యో దేవ దేవ!
శ్రీసదాశంభో! సు వాసుకి భూషణ!
మునివంద్య! నీకు నమోస్తు దేవ!
పరమేశ్వరా! భక్తవరకల్పకద్రుమా!
అరమరగాదు మా శరణు దేవ!
గీ. సర్వలోకాధినాథ! యో శరణు దేవ!
సకలభూతేశ! శంకర! శరణు దేవ!
సకలమౌనీశ! విశ్వేశ! శరణుదేవ!
దీనులను మమ్ము బ్రోవు మో దేవ దేవ!
గీ. అనుపమానుండు నజరుండు నద్వితీయు
డాదిదేవు డనంతుండు నవ్యయుండు
సర్వ జీవుల సమబుద్ధి సాకుచుండు
నట్టి సర్వేశ ని న్నాత్మయందు దలతు.
కం. సిరి పోగుజేయుటయు మరి
వరపుత్రునియందు ప్రేమ వరలెడుభంగిన్
నిరతము నొక క్షణమైనను
పరశివ నినుగొల్వ ముక్తి బడయుదురుగదా!
సీ. సర్వలోకాధిప! సనకాదిమునివంద్య!
శర్వ! యుమేశ్వర! శరణు శరణు
సచ్చిదానందుండ! స్వఃప్రకాశ! మహేశ!
జగదేకవంద్యండ! శరణు శరణు
నిర్వికల్పుండవో నిగమాంతసంచార!
సర్వలోకాధ్యక్ష! శరణు శరణు
నిర్గుణబ్రహ్మవు నిర్మలజ్ఞానివి
సాధుమనోల్లాస! శరణు శరణు
గీ. మూడుమూర్తుల కాధారమూర్తి! శరణు
జగము లెల్లను నేలెడి స్వామి శరణు
యెల్లజీవుల రక్షించు యీశ! శరణు
దీనజనవంద్య! మమ్మేలు దేవ దేవ!
(తృతీయావతంసము - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి)
దీయచరిత్రము లద్భుతంబులై
పావన మౌచు యీ భువన
వంద్యము లై చెలువారుచుండునో
దేవర! మీకృపారసము
దీనులపై నిక్ జూపవేమి మా
భావములందు నెంచి బహు
భంగుల్ బ్రస్తుతిజేతు మీశ్వరా!!
మ. హర! గంగాధర! ఫాలనేత్ర! రివు సం
హారా! దయాంభోనిధీ!
వరగౌరీ కుచకుంకుమాగరుల స
త్పాటీబాహ్వంతరా!
కరముల్ మోడ్చి నమస్కరించిని యో
కైవల్య సంధాయకా!
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
శా! బ్రోవు సర్వేశ్వరా!
మ. నిరతంబున్ నిను గొల్పి భక్తవరులున్
నిత్యంబు నీ సన్నిధిన్
పరమామోదముతోడ నుందు రని చె
ప్ప న్వింటి ముమ్మాటికిన్
మొర నాలించియు నాశ లన్నియును ని
ర్మూలంబుగా జేయు మీ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
శా! బ్రోవు వీరేశ్వరా!
మ. స్థిరమౌ నీ దగు నామమంత్రమును మా
చిత్తంబులన్ నమ్మి తో
పరమేశా! గిరిజాధవా! మురహరా!
ఫాలక్షా! యం చాత్మలో
పరితాపంబును జెందు భక్తతతి కా
పాడంగ విచ్చేసితౌ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
శా! బ్రోవు భీమేశ్వరా!
సీ. మహనీయ! నీ దగు మహిమల దెలియంగ
నల మౌనివరులకు నలవి యగునె
యీశ్వర! నీరూప మేవేళలందైన
వేదాంతదృష్టుల వెలయుచుండు
యిందుశేఖరు డెందమందు ధ్యానించంగ
యీషణత్రిత్రయం బదెల్ల బాయు
భవ! నీ శిరమ్మునం బరగు యా సురనది
రంగత్తరంగముల్ పొంగుచుండు.
గీ. భువనవందిత జగదంబ యెవని పత్ని
వాసుకియు తక్షకుండును వరసుకుండ
లమ్ములై యుండు యెవని కర్ణమ్ములందు
ఆమహేశుడ వీవు గావే మహాత్మ!
గీ. రాజసంబున సృజియించు ప్రభు వెవండొ
సాత్వికంబున బోషించు స్వామి యెవడొ
తామసంబున హరియించు దైవ మెవడొ
అట్టి దేవాదిదేవుడ వయ్య నీవు!
సీ. శ్రీపార్వతీనాథ! శ్రితజనమందార!
దీనశరణ్య! యో దేవ దేవ!
పన్నగభూషణ! సన్నుతామరవంద్య!
దీనశరణ్య! యో దేవ దేవ!
శ్రీసదాశంభో! సు వాసుకి భూషణ!
మునివంద్య! నీకు నమోస్తు దేవ!
పరమేశ్వరా! భక్తవరకల్పకద్రుమా!
అరమరగాదు మా శరణు దేవ!
గీ. సర్వలోకాధినాథ! యో శరణు దేవ!
సకలభూతేశ! శంకర! శరణు దేవ!
సకలమౌనీశ! విశ్వేశ! శరణుదేవ!
దీనులను మమ్ము బ్రోవు మో దేవ దేవ!
గీ. అనుపమానుండు నజరుండు నద్వితీయు
డాదిదేవు డనంతుండు నవ్యయుండు
సర్వ జీవుల సమబుద్ధి సాకుచుండు
నట్టి సర్వేశ ని న్నాత్మయందు దలతు.
కం. సిరి పోగుజేయుటయు మరి
వరపుత్రునియందు ప్రేమ వరలెడుభంగిన్
నిరతము నొక క్షణమైనను
పరశివ నినుగొల్వ ముక్తి బడయుదురుగదా!
సీ. సర్వలోకాధిప! సనకాదిమునివంద్య!
శర్వ! యుమేశ్వర! శరణు శరణు
సచ్చిదానందుండ! స్వఃప్రకాశ! మహేశ!
జగదేకవంద్యండ! శరణు శరణు
నిర్వికల్పుండవో నిగమాంతసంచార!
సర్వలోకాధ్యక్ష! శరణు శరణు
నిర్గుణబ్రహ్మవు నిర్మలజ్ఞానివి
సాధుమనోల్లాస! శరణు శరణు
గీ. మూడుమూర్తుల కాధారమూర్తి! శరణు
జగము లెల్లను నేలెడి స్వామి శరణు
యెల్లజీవుల రక్షించు యీశ! శరణు
దీనజనవంద్య! మమ్మేలు దేవ దేవ!
(తృతీయావతంసము - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి)
No comments:
Post a Comment