Sunday, May 3, 2026

మేలిమి తెలుఁగు లో నెలలు, తిథులు, వారములు (బంగారు నాణేలు పుస్తకం నుండి)

 ఇది గతంలో నా వామనగీత బ్లాగులో సేకరించిన విషయాలకు కొనసాగింపు అనుకోవచ్చు. తమిళనాట మేలిమి తెలుఁగులో వాడుఁకలో ఉన్న నెలల పేర్లు అందులో ప్రస్తావించాను. (వామన గీత: తెలుగు - నెలలు, సంవత్సరాలు, అంకెలు)


పంచాంగాలలో మనం నిత్యం వాడే పదాలకు,  వాచస్పతి గారు మేలిమి తెలుఁగులో కూర్చిన మాటలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.



నవగ్రహాలు - తొమ్మిది విన్నరాలు


 
జ్యోతిషం (జ్యోతుల గుఱించిన శాస్త్రం)లో గ్రహం అంటే ప్రభావితం చేసేది అనే అర్థం ఉంది. ఆ అర్థంలో వాడడానికి విన్నరం అనే మాటను వాడాను. ఆధునిక ఖగోళ శాస్త్రంలో గ్రహం అంటే నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటే భారీ గోళం అనే అర్థం ఉంది. అందుకు పలి అనే మాట వాడాను. 

వారాలు 



తిథులు





నక్షత్రాలు - మిలారాలు




మాసముల పేర్లు - నెలల పేర్లు






అవకాశం బట్టీ, తెనుఁగుల ఇంటివేల్పు  వెంకుని చేఁదల్పు బట్టి తెనుఁగుల కొలుపులకు అక్కఱ పడేెంత వరకూ, సంస్కృతంలోని సంకల్ప పాఠాన్ని మేలిమి తెలుఁగులో వ్రాసేందుకు కైఁజూస్తాను (ప్రయత్నిస్తాను). 

అది మఱొక టపాలో

అన్నమాచార్యుల దశావతారాల కీర్తనలు

తెలుగు వారి సంస్కృతిలో అన్నమాచార్యులది విశిష్ట స్ధానం. తెలుగు సాహిత్యం వరకే చూసుకున్నా, నన్నయ, తిక్కన, పోతన వంటి మహామహుల వరుసలో ఉండే వ్యక్తి. అన్నమయ్య కీర్తనలలోని పదసంపద పైన ఇప్పటికీ జరుగుతున్న పరిశోధనలే ఇందుకు నిదర్శనం.


పరిశోధకులు ఆయన కీర్తనలని సాధారణంగా, భక్తి కీర్తనలు, శృంగార కీర్తనలుగా పేర్కొంటూ ఉంటారు. కొంచెం సూక్ష్మంగా గమనిస్తే, ప్రతీ కీర్తనకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మచ్చుకు కొన్ని, "ముద్దుగారే యశోద" అనే కీర్తనలో నవరత్నాల కూర్పు ఉంటుంది, "తిరువీధుల మెరసీ" అనే కీర్తనలో శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి ఉంటుంది. శ్రీవారి అలంకారం సమయంలో అన్నమయ్య వంశస్ధులు పాడే "షోడశ కళానిధికి" షోడశోపచారాల గురించి ఉంటుంది.


అదే కైవడిలో, విష్ణమూర్తి పది అవతారాల గురించి వర్ణించే కీర్తనల గురించిన కొన్ని కీర్తనలు ఇవి.

1. ఇందరికి అభయంబు లిచ్చు చేయి




పల్లవి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||

చరణాలు 

వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కౌగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడిచేయి ||

తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
యనయ నాగేలు ధరియించు చేయి ||

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి || 


2. సిరుత నవ్వులవాడు సిన్నెక్కా



పల్లవి

సిరుత నవ్వులవాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా ॥ 


చరణాలు 
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా ।  
గొలుసుల వంకల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ॥


మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా । 
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ॥


బింకపు

 మోతల పిల్లగోవివాడు
సింక సూపులవాడు సిన్నెకా ।
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెకా ॥ 


3. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు



పల్లవి
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥


చరణాలు
మోతనీటి మడుగులో యీతగరచినవాడు ।
పాతగిలే నూతిక్రింద బాయనివాడు । 
మూతిదోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు । 
రోతయైన పేగుల పేరులు గలవాడు ॥

కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు ।
బూడిద బూసినవాని బుద్ధులవాడు । 
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు ।
దూడల నావులగాచి దొరయైనవాడు ॥


ఆకసానబారే వూరి అతివల మానముల ।
కాకుసేయువాడు తురగముపైవాడు । 
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి । 
యేకాలముబాయని యెనలేనివాడు ॥ 


4. పుడమి నిందరి బట్టె భూతము





పల్లవి 

పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||


చరణాలు 
కినిసి వోడమింగెడి భూతము | 
పునుకవీపు పెద్దభూతము |
కనలి కవియు చీకటిభూతము | 
పొనుగు సోమపుమోము భూతము ||

చేటకాళ్ళ మించినభూతము |
పోటుదొరల పెద్దభూతము |
గాటపుజడల బింకపుభూతము | 
జూటరినల్లముసుగు భూతము ||

కెలసి బిత్తలేతిరిగేటి భూతము | 
పొలుపుదాంట్ల పెద్దభూతము |
బలుపు వేంకటగిరిపై భూతము | 
పులుగుమీది మహాభూతము ||


దశావతారాల ప్రస్తావనలు కలిగిన కీర్తనల్లో నాకు తెలిసున్నవి, వినేవి ఇవి.