ఇది గతంలో నా వామనగీత బ్లాగులో సేకరించిన విషయాలకు కొనసాగింపు అనుకోవచ్చు. తమిళనాట మేలిమి తెలుఁగులో వాడుఁకలో ఉన్న నెలల పేర్లు అందులో ప్రస్తావించాను. (వామన గీత: తెలుగు - నెలలు, సంవత్సరాలు, అంకెలు)
పంచాంగాలలో మనం నిత్యం వాడే పదాలకు, వాచస్పతి గారు మేలిమి తెలుఁగులో కూర్చిన మాటలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.
నవగ్రహాలు - తొమ్మిది విన్నరాలు
జ్యోతిషం (జ్యోతుల గుఱించిన శాస్త్రం)లో గ్రహం అంటే ప్రభావితం చేసేది అనే అర్థం ఉంది. ఆ అర్థంలో వాడడానికి విన్నరం అనే మాటను వాడాను. ఆధునిక ఖగోళ శాస్త్రంలో గ్రహం అంటే నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటే భారీ గోళం అనే అర్థం ఉంది. అందుకు పలి అనే మాట వాడాను.
వారాలు
తిథులు
అవకాశం బట్టీ, తెనుఁగుల ఇంటివేల్పు వెంకుని చేఁదల్పు బట్టి తెనుఁగుల కొలుపులకు అక్కఱ పడేెంత వరకూ, సంస్కృతంలోని సంకల్ప పాఠాన్ని మేలిమి తెలుఁగులో వ్రాసేందుకు కైఁజూస్తాను (ప్రయత్నిస్తాను).
అది మఱొక టపాలో
No comments:
Post a Comment